సర్కారుకు ఇష్టంలేదు: అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేయలేమంటూ హైకోర్టులో జీఎస్ఎల్
హైదరాబాద్/అమరావతి: అగ్రిగోల్డ్ టేకోవర్‌పై జీఎస్సెల్ సంస్థ మళ్లీ వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులను తాము తీసుకోలేమంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ డీల్ నుంచి తప్పుకుంటామంటూ న్యాయస్థానానికి తెలిపింది.

రూ.10కోట్లు తిరిగిచ్చేలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందున ఆస్తులను టేకోవర్ చేయలేమని కోర్టుకు వెల్లడించింది. జీఎస్ఎల్ సంస్థ తాము డిపాజిట్ చేసిన 10 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టుకు విన్నవించింది. ఈ కేసులో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో..
కాగా, ఎనిమిది రాష్ట్రాలు, 25 నుంచి 30 లక్షల మంది బాధితులు, దాదాపు రూ. 20 వేల కోట్లు... కొన్ని ఏళ్లుగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. ఇప్పటికే జీఎస్సెల్ సంస్థ వెనక్కి తగ్గి.. మళ్లీ ముందుకు వచ్చింది. అయితే తాజా పరిస్థితులతో చేతులెత్తేసిన జీఎస్సెల్ సంస్థ... తాము డిపాజిట్ చేసిన మొత్తాన్ని వెనక్కి విప్పించాలని విజ్ఞప్తి చేసింది.

జీఎస్ఎల్ ప్రతిపాదన హేతుబద్దంగా లేదు: కుటుంబరావు
అగ్రిగోల్డ్ టేకోవర్ విషయంలో జీఎస్ఎల్ గ్రూప్ ప్రతిపాదన హేతుబద్దంగా లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ముందుగా అగ్రిగోల్డ్ ఆస్తులు తీసుకుని నెమ్మదిగి సొమ్ము చెల్లిస్తామని చెబుతోందని అన్నారు. ఆస్తులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత చెల్లిస్తామని చెబుతోందని తెలిపారు.

జీఎస్ఎల్ ప్రతిపాదనలు వ్యతిరేకంగా.. వేలం వేస్తాం
జీఎస్ఎల్ ప్రతిపాదనలను ఏపీ సర్కారు అంగీకరించడం లేదని కుటుంబరావు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా దీన్ని వ్యతిరేకించారని చెప్పారు. జీఎస్ఎల్ గ్రూప్‌పై అనేక అనుమానాలున్నాయని కోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. అయితే, కోర్టు అనుమతిస్తే జిల్లాలవారీగా కమిటీలు వేసి అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే వేలం వేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కోర్టు పర్యవేక్షణలో వేలానికి సిద్దమని కుటుంబరావు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications