బురఖా కింద అరకిలో బంగారంతో పట్టుబడిన జీనత్
హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని దొంగతనంగా తెచ్చే పద్ధతి హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగడం లేదు. దుబాయ్ నుంచి వచ్ిచన మహిళ ప్రయాణికురాలు జీనత్ బేగం నుంచి కస్టమ్స్ అధికారులు శనివారంనాడు విమానాశ్రయంలో అర కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శనివారంనాడు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన జీనత్ బేగం లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశఆరు. ఈ సమయంలో అర కిలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె నుంచి ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను విచారించారు.

జీనత్ బేగం బురఖా కింద బంగారాన్ని దాచినట్లు సోదాల సందర్భంగా అధికారులు గుర్తించారు. ఆమె తెచ్చిన బంగారం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. జీనత్ బేగం హైదరాబాదులోని పాతబస్తీలో గల జహనుమాకు చెందినవారు.
బంగారం అక్రమ రవాణాతో హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడుతున్న వ్యక్తుల సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ఆ మధ్య, ఓ వ్యక్తి కిలో బంగారంతో పట్టుబడ్డాడు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications