వ్యూహాత్మకం, కుట్ర పూరితం: సబ్బంపై హర్షకుమార్ ఫైర్

భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశం పార్టీలకు సబ్బం హరి ఎందుకు మద్దతు పలుకుతున్నారో తనకు అర్థం కావడం లేదని హర్షకుమార్ అన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమైతే.. అందుకు బిజెపి, టిడిపిలు సహకరించాయని హర్షకుమార్ చెప్పారు. బిజెపి సహకారం లేకుండా విభజన జరిగేది కాదని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎవరూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడం లేదని ఆయన చెప్పారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఎప్పుడూ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉంటుందని చెప్పారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టారని హర్షకుమార్ ఆరోపించారు. రాజ్యాంగ సవరణ లేకుండా విభజన జరగదని ఆయన అన్నారు. తుది తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని
భావిస్తున్నట్లు చెప్పారు. విభజనపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినందువల్లే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సబ్బం హరి ప్రకటించడం పట్ల హర్షకుమార్ అసహనం వ్యక్తం చేశారు.
సబ్బం హరి చెప్పిన కారణం సహేతుకంగా లేదని అన్నారు. తామందరం పార్టీలోనే ఉంటామని, ఎన్నికల బరిలోనూ ఉంటామని, సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మరే ఏ అభ్యర్థీ తప్పుకోవడం లేదని ప్రకటించారు. మాకు ప్రజలు మద్దతు తెలిపితే ఒక్కరమైనా.. ఇద్దరమైనా పోరాటం చేస్తామని సబ్బం హరి అన్నారు. తమ పార్టీపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ రాజకీయాలను ప్రజలు హర్షించరని చెప్పారు.












Click it and Unblock the Notifications