పద్మశ్రీలపై బ్రహ్మానందం, మోహన్ బాబులకు షాక్
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబులకు రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. తమకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డులను వారంలోగా తిరిగి ఇచ్చేయాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హైకోర్టు వారిని ఆదేశించింది. పద్మశ్రీ అవార్డులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
దేనికైనా రెడీ సినిమా విషయంలో వారిద్దరు పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బిజెపి నేత ఎన్ ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో నిరుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై వాదోపవాదాలు విన్న హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.

దేనికైనా రెడీ సినిమా టైటిల్స్ విషయంలో బ్రహ్మానందం, మోహన్ బాబు పద్మశ్రీ అవార్డులను ఇంటి పేరు మాదిరిగా వాడి దుర్వినియోగం చేశారని ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను ఇంద్రసేనా రెడ్డి తరఫు న్యాయవాది ఉటంకించారు. తాము దుర్వినియోగానికి పాల్పడలేదని బ్రహ్మానందం, మోహన్ బాబు తరఫు న్యాయవాదులు వాదించారు.
మోహన్ బాబుకు 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి 2010లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. హైకోర్టు తాజా తీర్పుపై మోహన్ బాబు, బ్రహ్మానందం సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఏం చేస్తారనేది ఇప్పుడే తెలియడం లేదు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications