1కి 30: పవన్ కల్యాణ్‌పై రూ.వందల కోట్ల బెట్టింగ్
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాన్ని ముగించేశాయి. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 174 ఒక ఎత్తు.. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మరో ఎత్తు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. రోజురోజుకు ఆయనకు ప్రజల నుంచి ఊహించనిరీతిలో ఆదరణ లభిస్తోంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం.. రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమిపాలైన పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలుపు ఖాయమేనని, అంచనా ఎంతనేది తేలాలనే విధంగా చర్చ నడుస్తోంది.
మెజారిటీపై బెట్టింగ్
అసెంబ్లీలో కచ్చితంగా తన స్వరం వినిపించాలనే పట్టుదలతో ఉన్న పవన్ పిఠాపురంను ఏరికోరి ఎంచుకున్నారు. పవన్ కు మద్దతుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు, బుల్లితెరకు చెందినవారంతా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ మద్దతు పవన్ కే అని తెలియజేశారు. ఇటువంటి తరుణంలో పవన్ కల్యాణ్ గెలుపుపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. కచ్చితంగా గెలుస్తాడని ఒక పందెం, గెలిస్తే మెజారిటీ ఎంత? 25వేలు వస్తుందా, 50వేలు వస్తుందా, 75వేలు వస్తుందా? లక్ష మెజారిటీ వస్తుందా?.. ప్రధానంగా వీటిపైనే బెట్టింగ్ నడుస్తోంది. పవన్ గెలుపుపై రూపాయికి 30 రూపాయల చొప్పున బెట్టింగ్ నడుస్తోంది.

బెట్టింగ్ కాసేవారిలో వైసీపీ కూడా..
బెట్టింగ్ కాసేవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా ఉండటం విశేషం. కాకినాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగా గీత గెలుస్తుందనే నమ్మకం ఎవరికి కలగడంలేదు. యువత నుంచి మధ్య వయస్కుల నుంచి, వృద్ధుల వరకు అందరూ పవన్ కల్యాణ్ కు జై కొడుతున్న పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం చుట్టూ వందల కోట్లరూపాయల పందెం నడుస్తోంది. నేరుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేయకపోయినప్పటికీ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ పరోక్షంగా మద్దతు తెలియజేయడం కూడా పవన్ కు బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి జనసేనాని జెండా ఎగరడం ఖాయమని జనసైనికులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.












Click it and Unblock the Notifications