ఏపీకి అలర్ట్.. బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం!
రానున్న 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి.. ఆంధ్ర-ఒడిశా తీరాల వైపు ముందుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగనున్నాయని వెల్లడించారు.
దక్షిణ కర్ణాటకలో మరో అల్పపీడనం ప్రభావం..
కాగా ప్రస్తుతం దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న మరో అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ, తూర్పు మధ్య మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో దక్షిణ భారతదేశం అంతటా వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కోస్తా ఆంధ్రలో గాలులు, వర్షాలు..
వాతావరణ శాఖ ప్రకారం.. కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
రాయలసీమలో భారీ వర్షాలు..
రాయలసీమ ప్రాంతంలో కూడా వాతావరణం తీవ్రంగా మారబోతోందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నంద్యాల, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ఛాన్స్ ఉందని.. చిన్న వాగులు, వంకల ప్రవాహాలు ఉధృతంగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు తీరప్రాంత మత్స్యకారులు రాబోయే మూడు రోజులు సముద్ర యాత్రలు చేయకుండా ఉండాలని సూచించింది.
ఈ వర్షాలు రైతులకు రెండు విధాల ప్రభావం చూపవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న రబీ పంటలకు తగిన తేమ లభించడంతో ప్రయోజనం కలగొచ్చని, కానీ వరి కోత దశలో ఉన్న జిల్లాల్లో ధాన్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులు పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచే భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షప్రభావిత జిల్లాల జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, కలెక్టర్లు, ఆర్టిజీఎస్ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలనీ ముఖ్యమంత్రి సూచించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications