భలే టెక్నాలజీ గురూ!ఫంక్షన్ లలో...చదివింపులకు కూడా హై టెక్ సిస్టమ్
విజయనగరం:మీరిప్పటిదాకా ఎన్నో వేడుకలకు వెళ్లుంటారు...అక్కడే అనేక సార్లు చదివింపులు కూడా పెట్టి వుంటారు. మీరు కానుకగా డబ్బో, గిఫ్టో ఇవ్వగానే అక్కడ ఉన్న అమ్మాయో, అబ్బాయో ఆ వివరాలు ఒక నోట్ బుక్ లో వాటి వివరాలు పద్దు రాసి పెట్టుకోవడం చూసి ఉంటారు.
అయితే విజయనగరం లో ఒక వేడుకకు వెళ్లిన వారంతా అక్కడ చదివింపుల కార్యక్రమం దగ్గర తతంగం చూసి ముందు అవాక్కయ్యారు. ఆ తరువాత వారెవా ఏ టెక్నాలజీ అని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. కారణం ఏమిటంటే అక్కడ చదివింపుల కార్యక్రమం కూడా అంతా హైటెక్ పద్దతిలో జరిగింది. ఆ పద్దతిలో మీరేం కానుక ఇచ్చారో, దాని గురించి వాళ్లు వివరాలు సరిగ్గా నమోదు చేసారో లేదో అని టెన్షన్ పడక్కర్లేదు. అదెలాగంటారా?...అయితే వివరంగా తెలుసుకోవాల్సిందే...
విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓ వ్యక్తి తన కుమార్తె కు ఆఫ్‌శారీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించాడు. ఈ వేడుక సందర్భంగా చదివింపుల కోసం వారు వినియోగించిన టెక్నాలజీ ఈ వేడుకకు హాజరైన వారిని ఆశ్చర్యపరిచింది. ఇంకేముంది ఇందుకు సంబంధించిన వివరాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అందరినీ అంతగా ఆశ్చర్య పరిచిన ఆ టెక్నాలజీ ఏమిటంటే?...

ఇక్కడ చదివింపుల దగ్గర ఒక ప్రత్యేకమైన కీబోర్డ్ వంటి పరికరం ఏర్పాటు చేశారు. దీన్ని మానిటర్ కు అటాచ్ చేశారు. ఎవరైనా చదివింపులు ఇవ్వగానే దీన్ని ఆపరేట్ చేసేవ్యక్తి ఆ వివరాలు కీబోర్డ్ మీద కొడుతుండగానే ఆ ఎదురుగా ఏర్పాటు చేసిన మానిటర్ మీద చదివింపుల తాలూకూ వివరాలు డిస్ ప్లే అవుతున్నాయి. దీంతో ఇచ్చిన కానుక వివరాలు కరెక్ట్ గా నమోదు చేశారో లేదో, లేదా పేరు వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో ననే టెన్షన్ లేకుండా ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ఆయా వివరాలు డిస్ ప్లే అవుతుండటం అతిధులను ఆశ్చర్యపరిచింది.
ఔరా!...ఏం టెక్నాలజీ అనుకుంటూ ఆశ్చర్యంగా తమ వంతు చదివింపులు సమర్పించి వెళుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కానుకలు, చదివింపుల వివరాలు గుట్టుగా ఉంటేనే బాగుంటుందని, మనం ఇచ్చిన కానుక ఏంటో ఇంటివారికి తెలిస్తే సరిపోతుందని, వచ్చిన వాళ్లందరికీ తెలియాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా పెద్దమొత్తంలో కానుకలు ఇవ్వలేని వారు ఈ పద్దతి వల్ల ఇబ్బంది పడతారని అంటున్నారు. ఏదేమైనా చదివింపుల కోసం కూడా ఇలా ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతున్నారని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications