విషాదం: బీఫార్మసీ విద్యార్థిని ప్రాణం తీసిన హోర్డింగ్
కాకినాడలోని జ్యోతుల మార్కెట్ దగ్గర ఓ హోర్డింగ్ ఊడిపడిన ప్రమాదంలో బీఫార్మసీ చదువుతున్న వాసంశెట్టి శాంతి అనే యువతి దుర్మరణం పాలైంది.
కాకినాడ: కాకినాడలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జ్యోతుల మార్కెట్ దగ్గర హోర్డింగ్ ఊడిపడడంతో ఓ యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన యువతి ఇంద్రపాలెం(బి) కి చెందిన వాసంశెట్టి శాంతిగా గుర్తించారు. ఆమె బీఫార్మసీ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. తల, వీపు భాగాల్లో బలమైన గాయాలు తగలడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ విద్యార్థిని శాంతి మృతి చెందింది.

ఆ ప్రాంతంలో హోర్డింగ్ లు ప్రాణం తీస్తున్నా కాకినాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శాంతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications