ఆటో డ్రైవర్ నిజాయితీ:గోల్డ్ ఉన్న బ్యాగ్ అప్పగింత

ఒంగోలు: ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాల బ్యాగుని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్న సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలు గంటపాలానికి చెందిన అలివేలు మంగమ్మ, మరో ఇద్దరు మహిళలు నెల్లూరులో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఉదయాన్నే బయల్దేరారు. గంటపాలెంలో ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ వద్ద దిగారు. 15 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయారు.

Honest auto driver returns gold to family

ఆటో డ్రైవర్ కోటేశ్వరరావు బ్యాగ్‌ను గుర్తించి బాధితులకు అందజేసేందుకు ప్రయత్నించినా వారు కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక బంగారు ఆభరణాల బ్యాగ్‌ని ట్రాఫిక్ అవుట్ పోస్టు పోలీసులకు అప్పగించాడు.

కొద్ది సేపటి తర్వాత తమ బ్యాగ్ పోయిందని గుర్తించిన బాధితులు అవుట్ పోస్ట్ పోలీసులను ఆశ్రయించారు. ఆటో డ్రైవర్ చేతుల మీదుగా బంగారు ఆభరణాలున్న బ్యాగుని పోలీసులు బాధితులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుుకున్న బాధితులు అతడికి రూ. 1000 నగదు ఇచ్చి అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+