ఆంధ్రా శబరిమల, ఎన్నో ప్రత్యేకతలు - పడిమెట్లు, పూజలు, మకర జ్యోతి దర్శనం వేళ ఇలా..!!
అయ్యప్ప స్వామి ఆలయం అనగానే అందరికి గుర్తొచ్చేది శబరిమల. అయ్యప్ప మాల ధరించిన దీక్షాధారులు శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించి, దీక్ష విరమిస్తారు. అయితే, శబరిమల తరహాలో అంతే సమానమైన ఖ్యాతి కలిగిన మరో అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో వెలసి ఉంది. ఆంధ్రా శబరిమలగా పిలుచుకునే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శబరిమల తరహా సంప్రదాయాలను ఇక్కడ కొనసాగిస్తున్నారు. ప్రతీ ఏటా వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ ఆలయంలోనే దీక్షలు విరమించటం.. మకర జ్యోతి దర్శనం కోసం తరలి వస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి ప్రసిద్ధ క్షేత్రం. అయితే ఏ కారణం చేత అయినా శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప దీక్షాధారులు ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించి అక్కడ తమ దీక్షను విరమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో వెలసిన అయ్యప్ప స్వామి క్షేత్రం ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సాధారణ గ్రామంగానే ఉన్న ద్వారపూడి కాలక్రమేణా అయ్యప్పస్వామి దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 1989లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఈ ఆలయంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలోని గర్భాలయంలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. అలాగే ఆలయ ప్రాంగణంలో హరిహరాదులకు ప్రత్యేక ఆలయాలున్నాయి.

కాగా, ఆలయ ముఖద్వారంలో శివకేశవుని, పశ్చిమ దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి అతి పెద్ద విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయ క్రింది భాగంలో దుర్గాదేవి ఆలయం, సింహ ద్వారం, శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి, షిరిడీ సాయినాథ్ మందిరం, నవగ్రహాలయం ఉపాలయాలుగా నిర్మించారు. అయ్యప్ప ఆలయానికి తూర్పు వైపున 200 అడుగుల పొడవున సొరంగం తవ్వి, 40 అడుగుల లోతులో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాలరాతితో మూడు అంతస్తులుగా నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో రుషికేశ్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమర్నాథ్, కాశీ, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన 18 శివలింగాలను ప్రతిష్టించారు. ఆలయం వెలుపల నటశేఖరుని, నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి.
శబరిమల తరహాలోనే ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా స్వామి దర్శనానికి వెళ్లడానికి పద్దెనిమిది మెట్లు ఉంటాయి. ఈ పద్దెనిమిది మెట్లు తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించారు. శబరిమలలో జరిగే సాంప్రదాయ రీతిలోనే ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో కూడా పూజోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజూ స్వామికి పాలాభిషేకం, నెయ్యి అభిషేకం నిర్వహిస్తారు. మకర సంక్రాతి రోజు శబరిమలలో మాదిరిగానే ద్వారపూడిలో కూడా మకర జ్యోతి దర్శనం ఉంటుంది. కాకినాడ-రాజమండ్రి కెనాల్ రోడ్ చెంతనే ఉన్న ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం అన్నవరం ప్రసిద్ధ సత్యనారాయణస్వామి టెంపుల్ నుంచి సుమారు 28 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి కేవలం 20 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే చాలా సులభంగా చేరుకోవచ్చు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ 170 కి.మీ. దూరం ఉంటుంది. కాకినాడ నుంచి 56 కిలోమీటర్లూ దూరంలో శంఖవరం అయ్యప్పస్వామి టెంపుల్ ఉంది.. ఇక్కడకు కాకినాడ నుంచి బస్సులు ఉంటాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications