ఆరోగ్యశ్రీ సేవల్లో మార్పులు - అమలులో ఇక నుంచి..!?
ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ తో పాటుగా భీమా కంపెనీలను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. భీమా కంపెనీలతోనూ చర్చలు చేసింది. పూర్తి స్థాయిలో చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకోనుంది.
కసరత్తు
ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో హైబ్రిడ్ విధానం దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 నుంచి రూ.2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు. వార్షిక భీమా పరిధి రూ 2.50 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు లెక్కల ప్రకారం ఈ ఖర్చు లోపు చికిత్స పొందే వారి సంఖ్య 97శాతం వరకు ఉంది. మిగిలిన వారికి ఖర్చు రూ 2.50 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్య శ్రీ ట్రస్లు ద్వారా చెల్లించేలా ఆలోచన చేస్తున్నారు.

హైబ్రిడ్ విధానం
ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. వార్షిక పరిమితి కింద నిర్దేశించిన రూ.25 లక్షల వరకు చికిత్స పొందుతున్నవారు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.2.5లక్షలు కాకుండా ఇప్పటివరకు అధికంగా నమోదైన కేసులు రూ.5 లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి రూ.2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్ల వరకు భరించాల్సి వస్తుంది. వివిధ రాష్ట్రాలలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ,మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హైబ్రిడ్ విధానం అమలులో ఉండగా మహారాష్ట్రలో రూ.6 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది.
ప్రభుత్వానికి నివేదిక
ఇందులో రూ.1.5వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా.. ఆపైన అవసరమైతే ట్రస్టు ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయాలోనూ ఇది ఉంది. ట్రస్టు విధానాన్ని ఏపీతోపాటుగా ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, హరియాణా, బిహార్ తదితర రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. బీమా సంస్థనుబట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశముంది. దీంతో, ఏపీలో ఈ విధానం అమలు పైన కసరత్తు వేగవంతం చేసారు. అయితే, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి అందించనుంది. దీని పైన చర్చించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
"టమాటా - ఎండు చేపల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే..! -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
మోర్ డేంజర్- ఆ వెయిట్ లాస్ డ్రగ్ పై కేంద్రం హెచ్చరిక -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications