యుటి కాదు, ఆ రాజధాని తొందరైతే మంచిది: వివేక్

తక్కువ ధరకు ప్రభుత్వ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సోదరులుగా విడిపోదామని సీమాంధ్ర నాయకులను తాము కోరుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్రలో ఓ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, ఐఐటిని ఏర్పాటు చేయాలని తాము కూడా కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనపై వెనక్కి పోవడానికి ఆంటోనీ కమిటీని వేయలేదని, విభజనపై తలెత్తే సమస్యలను వినడానికి మాత్రమే ఆ కమిటీని వేశారని మందా జగన్నాథం అన్నారు. అధిష్టానం నిర్ణయానికి సీమాంధ్ర నాయకులు కట్టుబడి ఉండాలని వివేక్ కోరారు.
హైదరాబాద్‌లో జగన్ సభ పెడితే మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పాల్సిన అవసరం వస్తుందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణను అడ్డుకుంటే ఆంధ్రా అభివృద్ధిని అడ్డుకున్నట్లేనని ఆయన వరంగల్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈ నెల 19వ తేదీన తలపెట్టిన సమైక్య శంఖారావం హైదరాబాద్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వవద్దని తెరాస నేతలు డిజిపి ప్రసాదరావును కోరారు. ఈ మేరకు వారు గురువారం వారు ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు.












Click it and Unblock the Notifications