ఫొటోలు: అమెరికాలో అదృశ్యమై, ప్రమాదంలో శవాలై

హైదరాబాద్: అమెరికాలోని వర్జీనియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాదులోని నేరేడుమెట్‌కు చెందిన శరత్ సుదర్శనం అనే పాతికేళ్ల యువకుడు మరణించాడు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

కర్నూలుకు చెందిన స్నేహితుడు మల్లికార్జున్ మోతా, తమిళనాడుకు చెందిన విఘ్నేష్ అశోన్‌లతో కలిసి మేరీల్యాండ్ నుంచి వర్జీనియాకు కారులో వెళ్తుండగా హైవేలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో శరత్‌తో పాటు ఇద్దరు మిత్రులు కూడా మరణించారు. శరత్, విఘ్నేష్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తుండగా, మల్లికార్జున్ ఐటి నిపుణుడు

hyderabadi dead in USA in a road accident

ఆ సమాచారాన్ని టీవి చానెళ్ల ద్వారా తెలుసుకున్న శరత్ తల్లిదండ్రులు ఉదయ్ కుమార్, ప్రసూన, సోదరడు విక్రమ్ శోకసముద్రంలో మునిగిపోయారు. వర్జినీయా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది జనవరి శరత్ వెళ్లాడు.

hyderabadi dead in USA in a road accident

ఈ నెల 10వ తేదీ శనివారంనాడు ముగ్గురు యువకులు అదృశ్యమైనట్లు గుర్తించారు. దాంతో అమెరికాలోని తెలుగు సంఘం తానా టీమ్ స్క్వేర్ వాలంటీర్లు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారు ప్రమాదంలో మరణించినట్లు మంగళవారంనాడు తెలిసిందని తానా ప్రతినిధి మోహన్ నన్నపనేని ఓ ప్రకటనలో తెలిపారు. శవాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని ఆయన చెప్పారు. శవాలు చూడడానికి, స్వదేశం పంపించడానికి వీలులేని స్థితిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ వద్ద ప్రమాదంలో వారు మరణించినట్లు తెలిపారు.

ఆ ముగ్గురు యువకుల అంత్యక్రియలపై కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వర్జీనియా ఫెయిర్‌ఫాక్స్‌లో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+