భువనగిరి నుండి పోటీ: ఎర్రబెల్లి, టిడిపికే ఓటుఅని షిండే

రాజ్యసభ ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తానని శాసన సభ్యులు హనుమంత్ షిండే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అబ్యర్థికి ఓటేస్తానని గంగుల కమలాకర్ చెప్పారు. తెరాస అభ్యర్థి బరిలో లేకుంటే తాను ఓటింగుకు దూరంగా ఉంటానని చెప్పారు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ... తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదని, కాబట్టి తాము ఓటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లోకి కూడా వెళ్లమని చెప్పారు. తాము డబ్బులకు అమ్ముడు పోయే రకం కాదన్నారు. కాంగ్రెసు, టిడిపిలకే కుమ్మక్కు రాజకీయాలు తెలుసునని చెప్పారు.
52 మంది ఎమ్మెల్యేల మద్దతు
తనకు 52 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రాజ్యసభకు పోటీ చేస్తానని చెబుతున్న చైతన్య రాజు అంటున్నారు. అన్ని పార్టీలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచి సమైక్య సత్తా చాటుతానని తెలిపారు.












Click it and Unblock the Notifications