ఎంపీగా ఫెయిలయ్యా, రాజీనామా చేస్తున్నా, ఎవరి దయతో గెలవలేదు: జెసి సంచలనం, ఇదే కారణం
అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
Recommended Video

అనంతపురం: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.తాను వచ్చే బుధవారం లోగా రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.
తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవించలేదన్నారు. చాగల్లు, తాడిపత్రిలకు నీరు తీసుకు రాలేకపోయానన్నారు. అనంత అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయన్నారు.

నాకు ఎంపీ పదవి ఎందుకు
తాను చాగల్లుకు నీళ్లు తేలేకపోతున్నానని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం నీళ్లు తేనప్పుడు ఇక తనకు ఈ పార్లమెంటు సభ్యత్వం ఎందుకని జెసి అన్నారు. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.ఎంపీగా ఫెయిలయ్యానని తన మనస్సాక్షి చెబుతోందన్నారు.

పదవికి మాత్రమే, పార్టీకి కాదు
తాను కేవలం పార్లమెంటు సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తానని జెసి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం కాదని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు.

చంద్రబాబు వెంటే
తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటే ఉంటానని జెసి దివాకర్ రెడ్డి ప్రకటించారు. తాను పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.

ప్రజల అభిమానంతో గెలిచా
తాను 2014 ఎన్నికల్లో ప్రజల అభిమానంతో గెలిచానని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో నెగ్గలేదన్నారు. అలాంటి ప్రజలకు నీళ్లు తీసుకు రానప్పుడు ఇక తనకు ఈ పదవి ఎందుకు అని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications