బాబుతో చర్చకు సిద్దం, నిధులపై ప్రజలకు వివరిస్తాం: సోము వీర్రాజు
అమరావతి: ఏపీ రాష్ట్ర అభివృద్దిపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తాను చర్చకు సిద్దమని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.ఏపీకి కేంద్రం చేస్తున్న సహయంపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు .ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని వీర్రాజు చెప్పారు.
ఏపీ రాష్ట్రానికి చెందిన బిజెపి నేతల సమావేశం విజయవాడలో ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చేసిన న్యాయంపై బీజేపీ సమావేశంలో షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏపీ పరిస్థితుల నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు ఈ షార్ట్ ఫిల్మ్ లో చూపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నిధుల వివరాలతో పాటు, ఇంకా ఏపీకి ఏం చేయబోతున్నారనే విషయాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించినట్టు సమాచారం.

చంద్రబాబుతో చర్చకు సిద్దం
చంద్రబాబుతో ఏపీ అభివృద్దిపై చర్చకు తాము సిద్దంగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన మమీలను 90 శాతం అమలు చేసినట్టు వీర్రాజు చెప్పారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగితే వేలాది కోట్ల రూపాయాల రోడ్లు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని వీర్రాజు పశ్నించారు.

అభివృద్దిని కోరుకొనేవాళ్ళం
ఏపీలో తాము అభివృద్దిని కోరుకొనేవాళ్ళమేనని సోము వీర్రాజు చెప్పారు. తాము అవినీతి పరులం కాదన్నారు. మళ్ళీ ప్రశ్నిస్తే సమాధానం కూడ చెప్పలేని వారు తమను విమర్శిస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు.రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఢిల్లీలాంటి రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించిందన్నారు.ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివే వాళ్ళు కూడ తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శిస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు.

ఏపీకి ఏం చేసిందో ప్రజలకు వివరిస్తాం
ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనే విషయమై ప్రజలకు వివరిస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు. ఏపీని అభివృద్దిపై బిజెపి సానుకూలంగా ఉందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుండి వచ్చిన పిధుల విషయమై ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

విభజన సమయంలో జగన్ ఏం చేశాడో తెలుసు
రాష్ట్ర విభజన సమయంలో ఎంపీగా ఉన్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆనాడు ఏం చేశాడో ప్రజలందరికీ కూడ తెలుసునని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గుర్తు చేశారు.ఏపీ రాష్ట్రానికి ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చామో ప్రజలకు వివరించనున్నట్టు సత్యనారాయణ చెప్పారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications