అక్రమ క్వారీలపై జగన్ ఆగ్రహం
గుంటూరు: అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో రైతులు మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సుద్దపల్లికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్రమ క్వారీలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న పోరాటానికిఅండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులుపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications