ఇండియాకు మరో అద్భుత రైలు తీసుకువచ్చిన నరేంద్రమోడీ
మనదేశంలో నడిచే అన్ని రైళ్లు దాదాపుగా విద్యుత్తుతో నడుస్తున్నాయి. విద్యుత్తు సదుపాయం లేనిచోట్ల డీజిల్ ఇంజన్లతో నడుస్తున్నాయి. వీటికి ముందు మన రైళ్లు బొగ్గుతో నడిచేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుంటూ రైళ్లు కూడా ఆధునికంగా రూపాంతరం చెందాయి. శతాబ్ధి ఎక్స్ ప్రెస్, రాజధాని ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్ రైళ్లతోపాటు సెమీ హైస్పీడ్ రైళ్లైన వందేభారత్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడాదిలో బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. వీటికితోడుగా భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలును తీసుకువస్తోంది.
అన్ని పరీక్షలు విజయవంతం
భారత్ లో తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి అన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దీన్ని రూపొందించింది. హైడ్రోజన్ ఇందనంతోపాటు బ్యాటరీ వ్యవస్థల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ప్రయోగాత్మకంగా నడిపించి చూశారు. సైకిల్ సిమ్యులేషన్ సరిపోల్చడానికి నిర్వహించిన పరీక్ష కూడా విజయవంతమైంది. పర్యావరణాన్ని కాపాడుతూ రైల్వే అభివృద్ధిలో భవిష్యత్తులో హైడ్రోజన్ రైలు కీలక పాత్ర పోషించబోతోందని అధికారులు చెబుతున్నారు.

ఏడాది చివరలో పట్టాలెక్కుతోంది
హెరిటేజ్ ఫర్ హెరిటేజ్ కార్యక్రమం కింద 35 హైడ్రోజన్ రైళ్లను తీసుకువస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటన చేశారు. ఒక్కో రైలుకు రూ.80 కోట్లు కేటాయించగా, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.70 కోట్లు కేటాయించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాలకు మద్దతుగా ఈ రైళ్లను రూపొందిస్తున్నారు. హైడ్రోజన్, ఆక్సిజన్ సంయోగంవల్ల రైలు ఇంజన్ పనిచేయడానికి అవసరమైన విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్ అనేది స్థిరమైన ఇంధనం. కేవలం ఎనిమిది బోగీలతో ఈ రైలు నడవనుంది. ఈ ఏడాది చివరకు పట్టాలెక్కబోతోంది.












Click it and Unblock the Notifications