పవన్ వెనుక బీజేపీ.. కాదు వెంటనే ఉన్నాం: పయ్యావుల వర్సెస్ మాధవ్
అమరావతి: అసెంబ్లీ లాబీల్లో గురువారం టీడీపీ నేత పయ్యావుల కేశవ్, బీజేపీ నేత మాధవ్‌ల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని పయ్యావుల వ్యాఖ్యానించారు.
దానికి మాధవ్ స్పందిస్తూ.. తాము పవన్ వెనుక లేమని, కానీ పవన్ కళ్యాణ్‌తోనే ఉన్నామని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రధానంగా టీడీపీ, వైసీపీలే ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండకపోవచ్చునని మాధవ్ అన్నారు. హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు.

బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చేతబట్టుకొని వైసీపీ సహకారంతో పవన్ పవన్ టీడీపీపై దాడికి దిగినట్లుగా కనిపిస్తోందని ఏపీ మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని, మనం గళమెత్తి మాట్లాడటం, కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించడంతో బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దిగారని అనుమానిస్తున్నారు.
అవినీతిపై ఏనాడు మాట్లాడని పవన్ ఇప్పుడు మాట్లాడటం ఏమిటని అంటున్నారు. కేంద్రంపై దాడి మొదలుపెట్టగానే రాత్రికి రాత్రి అవినీతిపరులం అయ్యామా అంటున్నారు.












Click it and Unblock the Notifications