అమ్మాయిలతో.. జగన్ ఎంపీ అభ్యర్థిపై అసభ్య ప్రచారం
ఖమ్మం/నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖమ్మం లోకసభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఇంటర్నెట్‌లో అశ్లీల ప్రచారం చేస్తున్నారట. మహిళలతో అశ్లీలంగా ఉన్న వ్యక్తి ముఖానికి శ్రీనివాస్ ఫోటోను మార్ఫింగ్ చేసి వాటిని ఇంటర్నెట్‌లో పెట్టారు. ఎన్నికల బరి నుండి తప్పుకోకుంటే వాటిని నియోజకవర్గం పంచుతామని అందులో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ఏజెంట్ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదయింది.
నల్గొండలోని ప్రతి ఎకరాకు కృష్ణా జలాలు అందిస్తామని తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం అన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీయే అని చెప్పారు.

అరకులో విజయమ్మ
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించి జగన్ ముఖ్యమంత్రిని చేయాలని, వైయస్ స్వర్ణయుగాన్ని తీసుకువద్దామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ఆమె అరకులో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే జగన్ ఐదు సంతకాలతో ప్రజల దశాదిశా మారుస్తారని హామీ ఇచ్చారు.
అనంతపురంలో షర్మిల
చంద్రబాబు తన తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రైతుల రుణమాఫీ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదని షర్మిల అనంతపురం జిల్లాలో మండిపడ్డారు. వైయస్ తెచ్చిన పథకాలనే ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారన్నారన్నారు. చంద్రబాబు వ్యవహారం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉందన్నారు. జగన్‌కు ప్రజల సంతోషమే ముఖ్యమని ఒక్క అవకాశం ఇస్తే ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకింతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications