ప్రయాణికులకు ఇండియన్ రైల్వే అదిరిపోయే వార్త
రైల్వే ప్రయాణికులందరికీ త్వరలోనే బీమా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బీమా ఉంటే ఆర్థిక భరోసా లభిస్తుంది. బీమా కంపెనీలతో ట్రైన్ ప్యాసింజర్లు అందరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. రిజర్వేషన్ బుక్ చేసుకున్నవారికి బీమా లభిస్తోంది. కౌంటర్ లో టికెట్ కొని రైలు ఎక్కినవారికి మాత్రం ఈ సదుపాయం లేదు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న రైల్వే ప్రయాణించే ప్రతి ఒక్కరికీ బీమా కవరేజ్ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ఐఆర్‌సీటీసీ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది. కొంత మంది మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. వాలిడ్ ట్రైన్ టికెట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పస్టం చేశారు. బీమా కవరేజ్ అంశంపై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని, రైల్వే ప్రయాణికుల భద్రతనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (సేఫ్టీ సహా) కోసం ప్రభుత్వం గత 9 ఏళ్ల కాలంలో ఏకంగా రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో రైల్వే ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. దశాబ్ద కాలం కిందట రైల్వే ప్రమాదాల సగటు 200గా ఉండేదని, కానీ ఇప్పుడు ఇది 45కు తగ్గిందని మంత్రి తెలిపారు.

రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి బీమా అందించాలంటే ఏం చేయాలి? అనే విషయంపై రైల్వే బోర్డు, బీమా కంపెనీలమధ్య గతంలోను చర్చలు జరిగాయి. అయితే మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెబుతున్నదాని ప్రకారం ఇకనుంచి రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి బీమా అందించడమే రైల్వే ధ్యేయంగా ఉందంటున్నారు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications