దసరా ప్రయాణాలపై రైల్వే బిగ్ అప్డేట్..!!
దసరా వేళ రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు డివిజన్ల పరిధిలో దసరా వేళ అదనపు సర్వీసుల డిమాండ్ పైన సమాచారం కోరింది. దసరాను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగుతాయి. దీంతో, ముందస్తుగానే రైళ్ల ప్రకటన చేసేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అదే సమయంలో దసరా రిజర్వేషన్ ప్రారంభించింది.
దసరా పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రైళ్లన్నీ ఫుల్ అవుతాయి. ప్రతీ ఏటా పండుగల ప్రయాణాలతో రైళ్లు కిక్కిరిసి పోతాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో పండుగ చివరి మూడు రోజుల వరకు రద్దీ కొనసాగుతోంది. లాంగ్ జర్నీ రైళ్లల్లో ముందస్తుగానే రిజర్వేషన్లు నిండుకుంటాయి. ఈ సారి ముందుగానే అదనపు రైళ్ల సమాచారం ఇచ్చేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక, అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకుల సౌకార్యర్ధం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

ముందస్తు రిజర్వేషన్ లో భాగంగా సెప్టెంబరు 30వ తేది ప్రయాణానికి శనివారం (ఆగస్టు 1వ తేది) రిజర్వేషన్ ప్రారంభమైంది. అదే విధంగా అక్టోబరు 1వ తేదీ ప్రయాణానికి ఆదివారం, అక్టోబరు 2వ తేదీ ప్రయాణానికి సోమవారం, అక్టోబరు 3వ తేదీ ప్రయాణానికి మంగళవారం, అక్టోబరు 4వ తేదీ ప్రయాణానికి బుధవారం, అక్టోబరు 5వ తేదీ ప్రయాణానికి గురువారం, అక్టోబరు 6వ తేదీ ప్రయాణానికి శుక్రవారం ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి అన్నిరకాల రిజర్వేషన్ ప్రారంభం కానుందని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు సైతం అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు మార్గాల ఖరారు పైన కసరత్తు చేస్తున్నాయి. దీంతో, రైల్వే శాఖ అదనపు రైళ్ల నిర్వహణతో పాటుగా ప్రస్తుతం ఉన్న రైళ్లకు డిమాండ్ మేరకు కోచ్ ల సంఖ్య పెంపు పైనా ఆలోచన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications