నేను పెద్దిరెడ్డి మనిషి, వైసీపీ చంద్రబాబును వదల్లేదు, ఇప్పుడు సీఎం వదిలేస్తారా?
జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, గ్రామాల్లో అభివృద్ధి పనులకు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఆ జిల్లా జడ్పీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్ ల పరిస్థితి మరో రకంగా తయారైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంతం జిల్లా చిత్తూరు జడ్పీలో అయితే అప్పుటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అండదండలతో చిత్తూరు జిల్లా జడ్పీని సర్వనాశనం చేశారని ఆడిటింగ్ లో వెలుగు చూడడం కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా జడ్పీలో లెక్కతేలని రూ. 19 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆడిట్ శాఖ విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. చిత్తూరు జిల్లా మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి ఈ గోల్ మాల్ చేశాడని వెలుగు చూసింది.

జడ్పీ నిధులు సర్వసాధారణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. అయితే అభివృద్ధి పనుల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని వెలుగు చూసింది. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకుండా కోట్లాది రూపాయాలు దుర్వినియోగం చేశారని తెలిసింది. 2020-23లో చిత్తూరు జిల్లా జడ్పీటీసీ సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాలకు హాజరు అయిన జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ అధికారులు, వైసీపీ నాయకులు భోజనం చేయడానికి ఏకంగా రూ. 27 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక టెలిఫోన్ బిల్లులు, ఎయిర్ టికెట్ల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టాలని తెలిసింది. చిత్తూరు జిల్లా జడ్పీలో సుమారు 8 కోట్ల రూపాయలకు M. బుక్కులు లేవని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది.
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం నియోజక వర్గంలో ఎలాంటి పనులు చేయకుండానే కోట్లాది రూపాయలు బిల్లులు సృష్టించారని, అసలు అక్కడ పనులే జరగలేదని వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా జడ్పీ మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆశీస్సులతో కోట్లాది రూపాయలు మింగేశారని వెలుగు చూసింది. రూ. 20,000 రూపాయలు పైబడి ఏ వస్తువులు కొనాలన్నా టెండర్లు పిలవాలన్న నియమాలను పక్కనపెట్టి కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేశారని వెలుగు చూసింది.
ఎలాంటి టెండర్ల లేకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలకి ఆ కాంట్రాక్టు పనులు అప్పగించారని, చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయం ఆడిట్ లో వెలుగు చూడడం హాట్ టాపిక్ అయ్యింది. సుమారు రూ.19 కోట్లలకు పైగా జడ్పీ నిధులు స్వాహా చేశారని, దీనికంతటికి చిత్తూరు జడ్పీ మాజీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నాయకుల కారణమని ఆడిట్ అధికారుల విచారణలో వెలుగు చూడడం కలకలం రేపుతోంది.
అయితే వ్యవహారంలో సుమారు రూ. 19 కోట్లు గోల్ మాల్ జరిగిందని వెలుగు చూసిందని సమాచారం చిత్తూరు జడ్పీలో జరిగిన గోల్ మాల్ వ్యవహారం గురించి ఆడిట్ జరిగిందని, ఇంతకాలం జరిగిన గోల్ మాల్ వ్యవహారానికి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఆడిట్ శాఖ సీనియర్ అధికారి గోవిందప్ప మీడియాకు చెప్పారు. చిత్తూరు జడ్పీ గోల్ మాల్ వ్యవహారానికి సంబంధించి కొందరు అధికారులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని అదే జడ్పీకి చెందిన కొందరు అధికారులు అంటున్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications