పులివెందులలో జగన్ చేసిన ఆ తప్పే శాపంగా మారిందా..?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. సొంత నియోజకవర్గానికి శనివారం వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.ఈ సందర్బంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలకు జగన్ అందు బాటులో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ అప్యాయంగా పలికరిస్తూ వారికి ఫొటో అవకాశం కల్పిస్తున్నారు. వారిలో వృద్ధులు యువత, మహిళకు అంతా ఉన్నారు.
అంతా బాగానే ఉంది. కానీ ఇదే రకంగా అయిదేళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకం అయి ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావడం జరిగింది. అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు. అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న కోటరీ జగన్ దగ్గరకు ఎవర్ని చేరనీయలేదు.దాంతో జగన్ వచ్చి వెళ్లారన్నట్టుగా ఉండేది పరిస్థితి. సామాన్యులకు జగన్‌ను కలిసి పరిస్థితి లేకపోయేది. ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు. పులివెందుల వేరు. జగన్‌ని గెలిపించిన సొంత గడ్డ.

నిజంగా ఇవ్వాలంటే ఒకింత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకు ఇవ్వాలి. కానీ జగన్ ఆ పనిచేసినట్లుగా ఎక్కడా కనిపించలేదు. ఈ కారణంగానే ఆయన జనాలకు దూరం అయిపోయారు. ఈ కారణంగానే జగన్‌కు పులివెందుల మెజారిటీ కూడా ఈసారి తగ్గింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి పులివెందుల వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకం అవుతున్నారు. అందర్ని దగ్గరకు తీసుకుంటున్నారు. ఇదే రకంగా అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకం అయి ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. జగన్ ఇదే తీరున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడేసి రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తోందని, ప్రజలకు జగన్ చేరువ అవుతారని క్యాడర్ భావిస్తోంది. మరి పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications