జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామన్న డీజీ వికె సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జెళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వికె సింగ్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'అవినీతి ఉచిత పరిపాలన' అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని అన్నారు.
అవనీతికి అడ్డుకట్ట వేయకపోతే పూర్తి బాధ్యత నాదేనని అన్నారు. రాబోయే మూడు నెలల్లో జైళ్లలో అవినీతిని సంపూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లలో జామర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వీటితో పాటు జైళ్లలో అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జైళ్లలో వీడియో కాన్పరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జైళ్లలో ఖైదీల కోసం ప్రవేశపెట్టిన విద్యాదానం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications