రంగంలోకి: వెంకయ్య రాజీనామాకి జనసేన డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన తొలిసారి ఆందోళనకు దిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమిపూజ రోజున జనసేన ప్రత్యేక హోదా కోసం ధర్నా చేయడం గమనార్హం.

జనసేన పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు, పవన్ కళ్యాణ్ జెండాలతో ఆ పార్టీ శనివారం నాడు విజయవాడలోని కాలేశ్వర మార్కెట్ వద్ద ఆందోళనకు దిగింది. ప్రత్యేక హోదా పైన జనసేన తొలిసారి ధర్నా చేసల్తోంది. అయితే, జనసేన జెండాలతో ఎవరైనా చేస్తున్నారా లేక పార్టీకి చెందిన వారేనా తెలియాల్సి ఉంది.
ప్రత్యేక హోదా ఇవ్వాలని లేదంటే కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు తమ పదవికి రాజీనామా చేయాలని వారు నినవాదాలు చేశారు. లేదంటే తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications