జగన్‌పై ప్రశ్న: టిటిడిపై గవర్నర్‌కు జయసుధ ఫిర్యాదు!

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై ఒత్తిడి చేసి డిక్లరేషన్ పైన సంతకం చేయించారన్న విషయాన్ని ఆమె గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుల విషయంలో టిటిడి అధికారులు వివక్ష చూపుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ఒకటిన తిరుమలేశుని దర్శనానికి కుటుంబ సభ్యులతో వెళ్లిన తనతో డిక్లరేషన్ మీద సంతకం చేయించుకోవడంపై ఆమె మండిపడ్డారు.

Jayasudha

సందేహం ఉన్న వారితో డిక్లరేషన్‌పై సంతకాన్ని చేయించుకుంటామని తనపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాతికేళ్లుగా తిరుమలలో దైవ దర్శనం చేసుకుంటున్నానని ఏనాడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదన్నారు. ప్రత్యేకంగా డిక్లరేషన్‌పై సంతకం చేసేందుకు జెఈవో కార్యాలయానికి రావాలని టిటిడి అధికారులు కోరడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

ఏన్నో ఏళ్లుగా లేని సందేహం ఇప్పుడే ఎందుకు వచ్చిందని తాను అప్పుడే జెఈవో కార్యాలయ సిబ్బందిని ప్రశ్నించానని, డిక్లరేషన్ లేకుండా శ్రీవారి దర్శనానికి వెళితే అదే ప్రధాన కథనంగా ప్రసారం చేస్తారంటూ మీడియాపై జెఈవో కార్యాలయ సిబ్బంది నింద వేశారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్న సమాచారం తెలిసి.. డిక్లరేషన్‌పై ఆయన సంతకం కూడా తీసుకుంటారా అని ప్రశ్నిస్తే... సందేహం ఉన్న అందరితోనూ డిక్లరేషన్‌పై సంతకాలు తీసుకుంటామని సమాధానమిచ్చారన్నారు. డిక్లరేషన్ కోసం తనను ఇబ్బంది పెట్టలేదని ఈవో గోపాల్ చెప్పడం అబద్దమన్నారు. తనకు అలాంటి ఆఫీసు ఉంటుందని కూడా తెలియదని, తనంత తానే వెళ్లి డిక్లరేషన్ ఎలా ఇస్తానన్నారు.

హెచ్చార్సీకి ఫిర్యాదు

జగన్ ఈ నెల 2న తిరుమల క్యూ కాంప్లెక్స్‌లోకి చెప్పులతో వెళ్లడం.. డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం వంటి చర్యలతో ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతీశారంటూ తెరాస సేవక్, న్యాయవాది భార్గవ్ హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇతర మతాలవారు తిరుమల కొండపైకి వెళ్లినపుడు హిందూ విశ్వాసాలను గౌరవిస్తామని డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉండగా.. జగన్, కొంతమంది కార్యకర్తలు అందుకు విరుద్ధంగా ప్రవర్తించి, అపరాధం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ ఉదంతంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+