ఉమ సంచలనం: 'వైయస్ ఫ్యామిలీ గుట్టు రట్టు చేయనున్న జేసీ బ్రదర్స్'
వైయస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలి గుట్టును జేసీ సోదరులు త్వరలో బయటపెడతారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: వైయస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలి గుట్టును జేసీ సోదరులు త్వరలో బయటపెడతారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడే అర్హత వైసిపి అధినేత జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు లేదని చెప్పారు. బస్సు ప్రమాద మృతులకు జేసీ సోదరులు పరిహారం ఇస్తారన్నారు.

జగన్ వర్సెస్ జేసీ సోదరులు
జగన్ - జేసీ సోదరుల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు తనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని వైసిపి చేసిన ఆరోపణల పైన జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అనంతలో ధర్నా
జేసీ ప్రభాకర్ అనంతపురంలో ధర్నాకు దిగారు. సాక్షి దిన పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం సాక్షి దినపత్రిక కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్ కొడుకుతో కలిసి ధర్నాకు దిగారు. ప్రతి రోజు తమకు వ్యతిరేకంగా కథనాలు రావడంపై ఆయన మండిపడ్డారు.

జగన్ పైన ఊగిపోయారు
జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో.. పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ ఆవేశంతో ఊగిపోయారు. సీఎం చంద్రబాబు జేసీ బ్రదర్స్‌కు ఏ విధంగా సాయం చేస్తున్నారో జగన్ జవాబివ్వాలని, లేనిపక్షంలో ధర్నా శిబిరం నుంచి లేచే ప్రసక్తే లేదని భీష్మించారు. 'మగాడివైతే రారా.. తేల్చుకుందాం.. నీ బతుకు నాకు తెలీదా.. ఏదో నా బస్సులో ఫాల్టు అన్నావు. నీ దగ్గరకే వస్తా.. ఏమేమి కేసులు పెడతావో పెట్టు..' అని సవాల్ విసిరారు.

ఏం చెబుతున్నావ్..!
బస్సులో రెండో డ్రైవరే లేడని జగన్ అన్నాడని, ఎవడు చెప్పాడు? ప్రమాదంలో తలకు గాయమైన రెండో డ్రైవరే తాను డిక్కీలో పండుకున్నానని చెబుతున్నాడని, అసలు రెండో డ్రైవరే లేడంటే కేసయ్యేది కదా అని, డిక్కీలో పండుకునే సౌకర్యం బస్సులో ఉందని, డిక్కీకి రెండు వెంటిలేటర్లున్నాయని, ఏసీ ఉంటుందని, విదేశాల్లో కూడా ఇదే పద్ధతిలో బస్సులుంటాయని జేసీ ప్రభాకర్ అన్నారు.












Click it and Unblock the Notifications