ఎప్పుడో చచ్చింది!: జేసీ మళ్లీ సంచలన వ్యాఖ్య
చిత్తూరు: అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందన్నారు. కాంగ్రెస్ కోసం పని చేసే నాయకుడు ఎవ్వరు లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్సించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగాలేదని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం కూడా జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ లేనే లేదని టీడీపీ ఎంపీ జేసీ అన్నారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలోకి దింపిందని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం నేతలను మార్చాలని, అప్పుడే ఆ పార్టీ బాగుపడుతందన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతతో ఏఏపీ గెలవలేదని, కేజ్రీవాల్ అవినీతిపై చేసిన పోరాటమే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిందన్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలి: బొత్స
విభజన సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోనే వివిధ సంస్థలు, నదీ జలాల్లో వాటాల విషయంలో కేంద్రం స్పష్టతను ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications