తలుపులేసి, గెంటేసి విభజన బిల్లు పెట్టావ్ కదా: సోనియాపై జెసి ఘాటు వ్యాఖ్య

న్యూఢిల్లీ: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి బుధవారం నాడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపై జెసి స్పందించారు.

పార్లమెంటులో వీడియోలు తీసేసి, తలుపులు మూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును పెట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని జెసి... సోనియాను ప్రశ్నించారు. అప్పుడు లేనిది ఇప్పుడు బ్లాక్ డే గుర్తుకు వచ్చిందా అన్నారు.

ఈ బ్లాక్ డేను ఎవరు ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. విభజన బిల్లు పెట్టినప్పుడు ఏపీ ఎంపీలను బయటకు తరిమేసి బిల్లు పెట్టారన్నారు. ఆ మహానుభావురాలే బ్లాక్ డే పెట్టారన్నారు. కేవలం 5 రోజులు సస్పెండ్ చేస్తేనే సోనియా గాంధీ పెడబొబ్బలు పెడుతున్నారు.

అసలు ఎంపీలను పంపించి బిల్లు పెట్టినప్పుడే బ్లాక్ డే అన్నారు. ఈ రోజు బ్లాక్ డే అనడం విడ్డూరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాశ్వత సమాధికి ఆమెనే కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై సోనియా స్పందిస్తూ.. ఇది బ్లాక్ డే అన్నారు. దీనికి జెసి కౌంటర్ ఇచ్చారు.

JC hot comments on Sonia Gandhi

టిడిపికి బిజెపి రక్షణ: రఘువీరా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ దోపిడీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అండగా నిలుస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు.

త్వరలో అన్ని జిల్లాల్లో ఆప్కో షూరూంలు: కొల్లు రవీంద్ర

త్వరలో అన్ని జిల్లాల్లో ఆప్కో మెగా షోరూంలు ప్రారంభిస్తామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికాదన్నారు.

దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చింది: రావెల

కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మార్చిందని మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. తెలుగు గంగ కాలువను పూర్తి చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని, ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+