చంద్రబాబును ఏకేసిన జేపీ, పవన్ కళ్యాణ్‌తో సై అని..
విజయవాడ: డబ్బులు లేకపోయినప్పటికీ అప్పు చేసి ఆడి కార్లలో తిరుగుతూ ఇరుగుపొరుగు వారిని అప్పులు అడుగుతున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన పరోక్ష విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి పైన చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో జేపీ సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోతుందని తెలిసినా కొందరు నాయకులు స్వార్థం, అధికారం, కుటుంబాల లబ్ధి కోసం నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

అత్యధిక పన్నుల రాబడి వచ్చే హైదరాబాదును కోల్పోయాక ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్నారు. ఈ విషయం తెలిసి కూడా పార్టీలో ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చాయని ఎద్దేవా చేశారు.
ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు నాడు చెప్పారన్నారు. ఏపీ పైన ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితరాల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications