టిడిపిలో చేరిన జగన్ పార్టీ నేత జూపూడి(ఫొటో)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జూపూడికి పార్టీ జెండా కప్పి చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. జూపూడి చేరిక చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో దళితుల్ని భాగస్వాములను చేస్తామని చెప్పారు.

కాగా, జూపూడి ప్రభాకర్ రావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కొద్ది కాలంగా ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిని విభేదిస్తూ వచ్చిన జూపూడీ శుక్రవారం ఆ పార్టీని వీడారు.












Click it and Unblock the Notifications