కడప సెంట్రల్ జైల్ పై శ్రద్ద పెట్టిన చంద్రబాబు, వివేకా హత్య కేసు నిందితులకు షాక్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ సొంత జిల్లా కడపలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ పై చంద్రబాబు ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. వైసీపీ నాయకులతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావును కడప సెంట్రల్ జైలు సూపరింటెండెట్ గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు చేసింది. గత రెండున్నర సంవత్సరాలుగా కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ప్రకాష్ వైసీపీ నాయకులు ఆదేశాల మేరకు పని చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టు అయ్యి కడప సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులకు సకల మర్యాదలు చేశారని సూపరింటెండెంట్ ప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Kadapa Central Jail Superintendent Prakash has been transferred by Andhra Pradesh Government

వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన శివశంకర్ రెడ్డి అదే కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కడప సెంట్రల్ జైలులో ఉన్న శివశంకర్ రెడ్డికి రాచమర్యాదలు చేయడానికి కొందరు నేరస్థులని ఆయన ఉండే బ్యారెక్ పక్కనే ఉన్న మరో బ్యారెక్ లో పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. పక్క బ్యారెక్ లో ఉంటున్న కొందరు నేరస్తులతో కాలం గడుపుతున్న శివశంకర్ రెడ్డి వారితో రాచమర్యాలు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ఎప్పుడంటే అప్పుడు కడప సెంట్రల్ జైలుకు దర్జాగా వెళ్లి తండ్రితో మాట్లాడుతూ వస్తున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అధికారులకు కడప సెంట్రల్ జైలులో అప్పటి సూపరింటెండెంట్ ప్రకాష్ చేస్తున్న అక్రమాల గురించి తెలిసినా వైసీపీ ప్రభుత్వం ఒత్తిడితో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రెండు నెలలపాటు కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా ప్రకాష్ పని చేశారు.

ప్రకాష్ మీద పదేపదే ఆరోపణలు రావడంతో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలు కి బదిలీ చేశారు. ప్రకాష్ బదిలీ కావడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కడప సెంట్రల్ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డితోపాటు కొందరు నేరస్తులు వారు పొందుతున్న సకలసౌకర్యాలకు చెక్ పడిందని సమాచారం. మొత్తం మీద కడప సెంట్రల్ జైల్లో చక్రం తిప్పిన సూపరింటెండెంట్ ప్రకాష్ పై బదిలీ వేటుపడటంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+