20 రోజులకు రూ.30 కోట్ల రెమ్యునరేషన్?
లోకనాయకుడు కమల్ హాసన్ కు టైం అన్ని విధాలుగా కలిసివస్తోంది. ప్రధానంగా విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఏది పట్టుకున్నా బంగారంలా మారిపోతోంది. ప్రాజెక్టు కేలో నటిస్తుండటంవల్ల 20 రోజులకు 30 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందబోతోంది. అంతేకాదు.. త్వరలో విడుదల కావాల్సిన భారతీయుడు 2 సినిమాకు మంచి ప్రమోషన్ లభిస్తోంది.
విక్రమ్ సినిమాతో కమల్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. దీంతో ఆయనకున్న క్రేజ్, మైలేజ్ పెరిగాయి. ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుండటం ప్రధానంగా భారతీయుడు2కు అన్నివిధాలుగా కలిసిరాబోతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మక 'శాన్ డియాగో కామిక్ కాన్' వేడుకలో ప్రభాస్, రానా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనేతోపాటు సందడి చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమాను అంతర్జాతీయంగా విడుదల చేసుకోవడానికి ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనడం కలిసి వస్తోంది.

ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ను విడుదల చేసిన చిత్ర బృందంతో ఈ సినిమా తాలూకు చర్చల్లో కమల్ పాలుపంచుకున్నారు. భారతీయుడు 2 గురించి అక్కడ మాట్లాడే అవకాశం ఉండబోతోందని భావిస్తున్నారు. అలాగే ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమా కూడా పట్టాలెక్కింది. దీంతో ఈ సినిమాకు మోక్షం కలగనుంది.
'మహానటి' సినిమా తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కేని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ సూపర్ స్టార్లు కూడా ఇందులో నటిస్తుండటంతో రోజురోజుకు ఈ సినిమాపై క్రేజ్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా అన్ని భాషలవారు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిశాపటానీ కీలకమైన పాత్రను పోషిస్తోంది. 2024 సంక్రాంతికి అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications