'సీఎం చంద్రబాబు నాయుడును గద్దె దించాలని చూస్తున్నారా'
విజయవాడ: నారా చంద్రబాబు నాయుడును గద్దె దించాలని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆలోచన చేస్తున్నట్లుగా ఉందని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ మంగళవారం నాడు మండిపడ్డారు. కాపులను ముద్రగడ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఈ రాష్ట్రాన్ని ఫ్యాక్షనిస్ట్ చేతిలో పెడతావా అని ముద్రగడను ప్రశ్నించారు. కడప జిల్లాలో ఫ్యాక్షనిస్టుల కాళ్ల కింద బలిజలు నలిగిపోతున్నారని రామానుజయ ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ. మంజునాథ కమిషన్‌ను ఎందుకు కలవడం లేదో చెప్పాలని నిలదీశారు.

అక్టోబర్ 3 నుంచి అమరావతిలో పాలన
అక్టోబర్ 3వ తేదీన వెలగపూడిలో సచివాలయం ప్రారంభం కానుంది. 3వ తేదీన అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖల వారీగా ఆయా భవనాల్లో కేటాయించిన స్థలాన్ని కూడా ఉత్తర్వల్లో పేర్కొన్నారు.
30వ తేదీలోపే హైదరాబాద్ సచివాలయంలో ఉన్న తమ శాఖలకు సంబంధించిన ఫైళ్ల డిజిటలైజేషన్ పూర్తి చేసుకొని వాటిని వెలగపూడి సచివాలయానికి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 3వ తేదీ ఉదయం పది గంటల నుంచి ఏపీ పరిపాలన అంతా వెలగపూడి సచివాలయంలోని నాలుగు బ్లాకుల నుంచి ప్రారంభం కావాలని పేర్కొన్నారు.
అలాగే ఉద్యోగులకు సంబంధించి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 11 విజయ దశమి పర్వదినాన బ్లాక్ నెంబర్ 1లోని తన కార్యాలయంలోకి గృహ ప్రవేశం చేయనున్నారు. 12వ తేదీ నుంచి వెలగపూడి నుంచి చంద్రబాబు పరిపాలన ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5 నాటికి సీఎం కార్యాలయ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి సీఎంవోకు భవనాన్ని అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications