వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్ రాక: తొలిసారి కెసిఆర్, చంద్రబాబు కరచాలనం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కరచాలనం చేసుకున్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు శనివారం ఈ సంఘటన చోటు చేుసుకుంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్‌కు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతం పలికారు.

KCR and Chandrababu shakes hand first time

రాష్ట్రపతి రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్రపతికి స్వాగతం కాస్తా ముందుకు కెసిఆర్ వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు రాగానే కెసిఆర్ ఆయనతో కరచాలనం చేశారు.

అనంతరం ఆయనను తోడ్కొని వెళ్లి గవర్నర్‌కు ఇరుపక్కల కూర్చుని కొద్ది సేపు ముచ్చటించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం చంద్రబాబు, కేసీఆర్ తొలిసారి భేటీ అయ్యారు.

English summary

 Andhra Pradesh CM Nara Chandrababu Naidu and Telangana CM K Chandrasekhar Rao met each other after taking oaths as cms of respective states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X