రోడ్డుపై దిగిన కెసిఆర్: స్నేహితుల పలకరింపు, ఆనందం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారీ బందోబస్తు మధ్య కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు తెలిసిన స్నేహితులు రోడ్డుపై వెళుతూ కనిపించారు. దీంతో వెంటనే కెసిఆర్ కారులో నుంచి దిగి రోడ్డుపైనే వారిని పలకరించారు. ఏం పని మీద ఇటువచ్చారో తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన వారిని తమ ఇంటికి తీసుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం సెలవు రోజు కావడంతో కెసిఆర్ అధికారులు, మంత్రులతో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కాన్వాయ్‌లో వెళ్తుండగా.. క్యాన్సర్ ఆస్పత్రి మలుపు వద్ద ఇద్దరు సాధారణ వ్యక్తులు.. కెసిఆర్‌ను చూసి నమస్తే అని పలకరించారు. వారిని చూసిన సిఎం కెసిఆర్ వెంటనే వాహనం దిగి వారితో మాట్లాడారు.

KCR meets his friends

ఇటువైపు ఎందుకు వచ్చారని అడిగితెలుసుకున్నారు. మిమ్మల్ని కలిసేందుకే వచ్చామని చెప్పడంతో వారిని కెసిఆర్ తన ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు. దీంతో వారిని పోలీసులు కెసిఆర్ ఇంటికి తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత వచ్చిన కెసిఆర్ వారిని అప్యాయంగా పలకరించి యోగ క్షమాలు తెలుసుకున్నారు.

కాగా, కెసిఆర్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమది సిద్దిపేట అని, కెసిఆర్‌కు చిన్ననాటి నుంచి పరిచయస్తులమని తెలిపారు. కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చామని అన్నారు. తమను రోడ్డుపై చూసి వాహనం దిగి తమతో మాట్లాడటం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. తమను సిద్దిపేటలో ఎలా పలకరించారో.. ఇప్పుడు సిఎం అయిన తర్వాత కూడా అలాగే పలకరించారని చెప్పారు.
కెసిఆర్ మారలేదని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+