ట్యాపింగ్ రుజువైతే కేసీఆర్‌కు పదవీగండమే: హైద్రాబాద్‌పై ఉండవల్లి కొత్త వాదన

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పనిగా పెట్టుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రుజువు అయితే కేసీఆర్‌కు పదవీగండం తప్పదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం జోస్యం అన్నారు.

రేవంత్ రెడ్డి వ్యహారంలో ఏపీకి సంబంధం లేదన్నారు. ఇప్పటికైనా సెక్షన్ 8 అమలు కోరడ సంతోషకరమని చెప్పారు. పోలవరాన్ని నిర్మించి కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలన్నరు. పట్టిసీమ పేరుతో రూ.400 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

'KCR will face problems, If Phone tapping is true'

హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్నారు. హైదరాబాద్‌ను శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు చట్ట ప్రకారం పాస్ అవలేదని, దీనిపై సుప్రీం కోర్టులో తాను న్యాయపోరాటం సాగిస్తున్నానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన త్వరలో ప్రకటన రావొచ్చునని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా పైన త్వరలో ఎప్పుడైనా ప్రకటన ఉంటుందని చెప్పారు. హైదరాబాదులో అధికారుల తీరుతో ఆధ్రా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయలను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+