ఎంపీ స్థాయిలో ఉండి.. జీతాలు కూడా ఇవ్వరా?: కేశినేని సిబ్బంది ధర్నా
ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జీతాలు ఎగ్గొట్టడమేంటని కేశినేని సిబ్బంది వాపోతున్నారు. వేతన బకాయిలు చెల్లించకుండా హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడ: అనూహ్య నిర్ణయంతో కేశినేని ట్రావెల్స్ ను మూసివేయడంతో.. ఆ సంస్థ ఉద్యోగులంతా రోడ్డున పడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా సంస్థను మూసివేయడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అదీ గాక ఏడాదిగా వారికి జీతాలు ఇవ్వకపోవడంతో విజయవాడలోని సంస్థ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి జీతాలు ఎగ్గొట్టడమేంటని కేశినేని సిబ్బంది వాపోతున్నారు. వేతన బకాయిలు చెల్లించకుండా హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామంటూ తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికే రాత్రే తమను రోడ్డున నిలబెట్టారని ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

ట్రావెల్ సిబ్బంది ఆందోళనతో ఎంపీ కేశినేని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ అందుబాటులో లేరని, ఆయన విజయవాడ రాగానే సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తామని ఉద్యోగులు తెలిపారు. కాగా, ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications