విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం ఎలా మోసగించిందంటే: వివరాలతో సహా మోడీకి కేశినేని నాని షాక్, ఎంపీలకూ

|
Google Oneindia TeluguNews

విజయవాడ/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని పార్లమెంటు సభ్యులకు ఓ వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం చెప్పింది, కేంద్రం ఇచ్చింది అంటూ ఆ వాట్సాప్‌లో ఉంది.

దీనిని ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లోను పెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మన హక్కు ప్రత్యేక హోదా అని హెడ్డింగ్ పెట్టి ఈ పోస్ట్‌లో వివరాలు ఇచ్చారు. బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 19 అంశాలపై కేంద్రం చెప్పింది, బీజేపీ ఇచ్చిన దానిని పోస్ట్ చేశారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం

ప్రత్యేక హోదాపై కేంద్రం

ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం విభజన సమయంలో చెప్పిందని, కానీ ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి హోదా వద్దని చెప్పినందున ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పిందని, కానీ 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పలేదని పార్లమెంటులో హోంశాఖ సహాయమంత్రి చెప్పారని పేర్కొన్నారు.

ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఢిల్లీ రాజకీయం, ఉన్నారా లేరా: అసలేం జరిగింది?ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఢిల్లీ రాజకీయం, ఉన్నారా లేరా: అసలేం జరిగింది?

ఆర్థిక లోటు, వనరుల మధ్య అంతరం

ఆర్థిక లోటు, వనరుల మధ్య అంతరం

ఏపీకి రూ.16,000 కోట్ల ఆర్థిక లోటు అని తేలిందని, దీనిని కేంద్రం భరించాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు వచ్చింది కేవలం రూ.4000 కోట్లు మాత్రమేనని కేశినేని నాని పేర్కొన్నారు. రెవెన్యూ లోటును కూడా తగ్గించి లెక్కగడుతున్నారన్నారు.

పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుతామని విభజన సమయంలో చెప్పారని, కానీ ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.4343 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇంకా రాష్టానికి దాదాపు రూ.3వేల కోట్ల వరకు రావాలని పేర్కొన్నారు.

రైల్వే జోన్ ఏర్పాటు

రైల్వే జోన్ ఏర్పాటు

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలిపి విసాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని నాడు విభజన సమయంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు స్పందన లేదని కేశినేని నాని పేర్కొన్నారు.

రాజధాని అమరావతికి ఆర్థిక సాయం

రాజధాని అమరావతికి ఆర్థిక సాయం

రాజధాని అమరావతిని ఢిల్లీని మించిన రాజధానిగా చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమేనని, అమరావతి కోసం రూ.11,000 కోట్ల డీపీఆర్‌లు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.

ఏపీలో విశ్వవిద్యాలయాలు

ఏపీలో విశ్వవిద్యాలయాలు

ఏపీలో పలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందని, కానీ అనంతలో సెంట్రల్ వర్సిటీ, విజయనగరంలో వెనుకబడిన కులాలకు వర్సిటీ ఏర్పాటు గురించి పార్లమెంటులో అంగీకారం రాలేదని పేర్కొన్నారు.

ఈ 19 అంశాలు

ఈ 19 అంశాలు

గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, దుగరాజుపట్నం పోర్ట్, ఏపీ శాసన సభ సీట్ల పెంపు, పన్నుల విధానంలో సమస్యలు, వైజాగ్, చెన్నై పారిశ్రామిక కారిడార్, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ-విజయవాడ మెట్రో రైలు, అమరావతికి త్వరితగతిన రైలు-రోడ్డు అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కొరకు సాయం, షెడ్యూల్ 9 సంస్థల విభజన, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, షెడ్యూల్ 10 సంస్థల విభజన, గ్రేహౌండ్ ట్రెయినింగ్ సెంటర్ తదితర మొత్తం 19 అంశాలలో కేంద్రం ఇచ్చింది,

English summary
Kesineni Nani said BJP has cheated the people of Andhra Pradesh, over and about that they are publicising as if the have done more than required for AP. Here are the 19 pending issues that are due to us as per the reorganisation act and promises in Parliament. We are demanding for our rights not requesting!!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X