ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్‌లో మార్పు: కొత్త సిలబస్ ఇదే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలకు సంబంధించి కొత్త సిలబస్ విడుదలైంది. మొత్తం 450 మార్కులకు గానూ రెండు దశల రాత పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అభ్యర్థులకు ఎంపిక చేయనుంది. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్.. ఆ తర్వాత రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ప్రిలిమ్స్ అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు అర్హులవుతారు.
ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్ , పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ ఎఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉండగా.. ఒక్కొక్కటి 150 మార్కులకు(మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యంగం నుంచి.. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల
ఏపీలో 2023-24 ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. మొత్తం 302 రోజుల్లో.. పని దినాలు 227 రోజులని తెలిపింది. 75 రోజులు సెలవులు ఉంటాయని వెల్లడించింది. క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అకాడమిక్ క్యాలెండర్‌కి విరుద్ధంగా ఇంటర్ కాలేజీలు పనిచేసినట్లు తెలిస్తే చర్యలు తప్పవంటూ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. జూలై 26 నుంచి 28 వరకు యూనిట్ 1 పరీక్షలు జరుగుతాయని.. ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ 2 పరీక్షలు ఉంటాయని వెల్లడించింది.
సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ ఎగ్జామ్స్.. అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ 3 పరీక్షల నిర్వహించాలని సూచించింది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉంటాయని.. డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని... ఫిబ్రవరి రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెట్టాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ డే 28-3-2024.. 2024 మార్చి 29 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమై.. మే 31న ముగుస్తాయని పేర్కొంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications