దారుణం: ముగ్గురు చిన్నారుల హత్య, పెళ్లి కారణంతో

ఆయన ముగ్గురు మనవరాళ్లు సిరి (9), అక్షయ (6), ఖుషి (4) బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యారు. చిన్నారులను తమ బంధువు నరేందర్ రెడ్డి తీసుకెళ్లి ఉంటాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డి చిన్నారులను తీసుకెళ్లిన కారును బాసర వంతెన వద్ద గుర్తించారు.
ఆ తర్వాత ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా శివారులోని సుధీర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ సభ్యులు ఓ శుభకార్యం కోసం గంగస్థాన్‌కు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు నరేందర్ రెడ్డియే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పెళ్లి కాలేదనే....
తనకు వివాహం కాలేదనే మానసిక సంఘర్షణతోనే నరేందర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications