'తుఫాన్'లో చిక్కుకున్న కిరణ్!: ఉండవల్లిపై వినోద్ ఫైర్

కిరణ్ లాంటి ముఖ్యమంత్రిని చరిత్రలో చూడలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విద్యాసాగర్ రావు అన్నారు. విభజన తర్వాత కిరణ్ ఏ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాలేరన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని చెప్పి ఈ ప్రాంత ప్రజలను కిరణ్ బెదరగొడుతున్నారన్నారు. ఆంధ్రా ప్రాంతంలో దళితులను అణిచివేస్తున్న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారి పైన తిరుగుబావుటా ఎగురవేయాలన్నారు.
విభజనను అడ్డుకుంటామని చెప్పి కిరణ్ తాను సృష్టించికున్న తుఫాన్‌లో తానే చిక్కుకున్నారని విమర్శించారు. తెలంగాణ తీర్మానం, బిల్లు, 371 డి ఆర్టికల్ ఏదీ తెలంగాణకు అడ్డుకావన్నారు. విభజన అంశంపై తమ పార్టీ అధ్యయన కమిటీ వేస్తుందని, మూడు ప్రాంతాల్లోని సమస్యలపై అధ్యయనం చేసి జివోఎంకు వచ్చే నెల 5వ తేదిన నివేదిక ఇస్తామన్నారు. ఎపికి కిరణే చివరి ముఖ్యమంత్రి అన్నారు.
అడ్డుకునే శక్తి లేదు: మందకృష్ణ మాదిగ
సొంత జిల్లా ప్రజలు, ఎమ్మెల్యేల మద్దతు లేనిదే కిరణ్‌కు తెలంగాణను అడ్డుకునే శక్తి లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని 27న పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. నవంబర్ 10న కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు చెప్పారు.
సునామీ: శ్రవణ్
ఫైలిన్ ఒక తుఫాను అయితే.. తెలంగాణ ఉద్యమం సునామీ లాంటిదని తెరాస నేత శ్రవణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆఫడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి పదవిని అపహాస్యం చేస్తున్నారని, తక్షణం ఆయన పదవి నుండి తొలగిపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి పల్లకి మోసే బోయీల్లాగా మారారన్నారు. తెలంగాణ ఉప్పెనలో సిఎం కొట్టుకుపోవద్దని తెరాస సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు.
ప్రణబ్ పొత్తు కుదుర్చారు: వినోద్
తెలంగాణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అడ్డుకుంటారని చెప్పడం ఉండవల్లి అరుణ్ కుమార్‌కు సరికాదని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. తెరాస, కాంగ్రెసుల మధ్య అప్పుడు ప్రణబ్ పొత్తు కుదిర్చారని గుర్తు చేశారు. విలీనం పైన కాంగ్రెసు నుండి ఎలాంచి చర్చ జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications