వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌ను పిలువొద్దు: శంకరన్న, సుప్రీమా రానివ్వం: గండ్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు శంకర రావు మరోసారి నిప్పులు చెరగగా, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తన అసంతృప్తిని వెలిబుచ్చారు. శంకర రావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి తెలంగాణ జిల్లాల్లో పర్యటించే హక్కు లేదని విమర్శించారు.

రచ్చబండ పేరుతో కిరణ్‌ను తెలంగాణ జిల్లాలకు ఆహ్వానిస్తే అలాంటి వారు సమైక్యవాదానికి మద్దతిచ్చిన వాళ్లే అవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తాను తన నియోజకవర్గంలో గుడి కడతానని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆమెకు గుడి కట్టాలన్నారు.

డిసెంబర్ 9వ తేదీన తాను సికింద్రాబాదులో తాను సోనియాకు విగ్రహం పెడతానని చెప్పారు. అసెంబ్లీలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కిరణ్ సుప్రీం కాదు: గండ్ర

తమకు కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కాదని గండ్ర అన్నారు. కిరణ్‌ను తాము రచ్చబండ కార్యక్రమానికి ఆహ్వానించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. విలీనంపై రోజుకో మాట మాట్లాడే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రజలు నమ్మడం లేదన్నారు. తాము పొత్తు లేకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Government chief whip Gandra Venkataramana Reddy on Tuesday said CM Kiran Kumar Reddy is not our supreme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X