డిగ్గీ చెప్పినా.. కిరణ్ దూరమే!: 'జెసి' నేతలకి బొత్స క్లాస్

ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కిరణ్‌లు శుక్రవారం ఢిల్లీ వెళ్లి రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానం పెద్దలతో చర్చించవలసి ఉంది. అయితే, కిరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లడం లేదని సమాచారం.
గురువారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ.. కిరణ్ రేపు ఢిల్లీ వస్తున్నారని, ఆయనతో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతానని చెప్పారు. రాజ్యసభ అభ్యర్థుల అంశాన్ని చర్చించేందుకు కిరణ్ వస్తున్నారని చెప్పారు. కిరణ్ మాత్రం ఇప్పుడు వెళ్లడం లేదు. అయితే, శాసన సభ సమావేశాలు ఉన్నందున ఢిల్లీ రాలేదని కిరణ్ అధిష్టానానికి చెప్పారు. మరోవైపు రెబల్ అభ్యర్థులు రంగంలో ఉండటం కాంగ్రెసు పార్టీకి చికాకు కలిగిస్తోంది.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సమైక్యాంధ్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. జెసి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్‌పై కొంతమంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ దీనిని సీరియస్‌గా పరిగణించారు. జెసికి మద్దతునిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని అలా చేస్తే అధిష్ఠానాన్ని ధిక్కరించినట్లవుతుందని క్లాస్ పీకారట.












Click it and Unblock the Notifications