డిఫరెంట్ గా వైసీపీ మాజీ మంత్రి

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 82,010 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,634 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.58 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 21 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 21 నుండి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేాశారు.

Kodali Nani and Perni Nani visits Tirumala and offer Prayers to Lord Venkateswara

టీటీడీ- దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేది నుండి నవంబర్ 1వ తేదీ వరకు తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. 30, 31వ తేదీల‌్లో మ‌ధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

నవంబర్ 1వ తేదీన ఉద‌యం 8:30 గంట‌ల‌కు సామూహిక నామ సంకీర్త‌న‌ వినిపిస్తారు. ఉద‌యం 9:30 గంట‌ల నుండి స్వామిజీలు ధార్మిక సందేశ‌ం ఇవ్వ‌నున్నారు. అక్టోబర్ 31వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చెంతకు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లల్లో బిజీగా ఉంటోంది టీటీడీ.

కాగా- నేడు శ్రీవారిని దర్శించుకున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఉన్నారు. ఈ ఉదయం వీఐపీ సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని స్వామివారికి తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు.

కొద్దిరోజుల కిందటే కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించారు. పేర్ని నానితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల భక్తులను పలకరించారు. ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే కొడాలి నాని తలనీలాలు సమర్పించడంతో కాస్త డిఫరెంట్ గా కనిపిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+