జగన్‌పై వ్యక్తిగత విమర్శలా?, దాచుకో.. దోచుకో పాలనే: కోలగట్ల, ‘రోజాపై మొండి వైఖరి’
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'ఏపీలో దోచుకో.. దాచుకో పాలన'ఎద్దేవా చేశారు.
కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం మాట్లాడుతూ.. అమరావతి భూములు అమ్ముకోవడానికి విదేశాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులపై ధ్వజమెత్తారు. ఆ అక్రమ ఆస్తులు దాచుకోవడానికే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై కొల్లగట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసన సభలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చంద్రబాబుతోపాటు ఆపార్టీ ఎమ్మెల్యేలపై కోలగట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోజాపై మొండి వైఖరి
రోజా విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాన్ని అణగొదొక్కే ధోరణిలో ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే ప్రభుత్వ తీరును అర్ధం చేసుకోవచ్చని అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యపై 28న ఛలో అసెంబ్లీకి పిలుపును ఇస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications