ట్విస్ట్: సుమశ్రీ కేసులో కృష్ణకుమార్ పై మొదటి భార్య నీలిమ ఫిర్యాదు

విజయవాడకు చెందిన సుమశ్రీ కేసులో మరో ట్బిస్ట్ వెలుగుచూసింది. సుమశ్రీ కూతురు సాయిశ్రీ వారం రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించింది.

విజయవాడ: విజయవాడకు చెందిన సుమశ్రీ కేసులో మరో ట్బిస్ట్ వెలుగుచూసింది. సుమశ్రీ కూతురు సాయిశ్రీ వారం రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించింది.అయితే మరణించడానికి ముందుగా ఆమె తన తండ్రికి ట్రీట్ మెంట్ చేయించాలంటూ పంపిన సెల్పీ వీడియో పలువురిని కంటతడిపెట్టించింది.

విజయవాడకు చెందిన సాయిశ్రీ అనే బాలిక క్యాన్సర్ వ్యాధితో మరణించింది. అయితే బాలిక మరణానికి కొన్ని రోజుల ముందే ఆ బాలిక సెల్పీ వీడియో తీసి తనకు ట్రీట్ మెంట్ చేయించాలని కోరింది.ఈ వీడియో పలువురిని కంటతడిపెట్టించింది.

Krishna kumar cheated me:first wife Neelima

అయితే శివశ్రీ , శివకుమార్ ల కూతురు సాయిశ్రీ . అయితే భార్య,భర్తల మధ్య మన్స్పర్థల కారణంగా శివకుమార్, శివశ్రీలు విడిపోయారు. శివశ్రీ వద్దే సాయిశ్రీ ఉంటోంది.

అయితే సాయిశ్రీ క్యాన్సర్ చికిత్సకు తన రెండో భర్త కృష్ణకుమార్ ఆర్థికంగా సహాయం చేశారని శివశ్రీ ప్రకటించారు. దీంతో కృష్ణకుమార్ మొదటి భార్య విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.

కృష్ణెకుమార్ తనను మోసం చేశారని సుమశ్రీని రెండో వివాహం చేసుకొన్నారని ఆమె ఫిర్యాదుచేసింది. పెళ్ళినాటి ఫోటోలను ఆమె మీడియాకు విడుదల చేసింది. హైద్రాబాద్ లోని యూసుఫ్ గూడలో 2004 లో తనను కృష్ణకుమార్ ప్రేమ వివాహం చేసుకొన్నారని ఆమె ఆరోపించారు.

తమకు రాజేశ్వరి, దర్శిని ప్రియ అనే ఇద్దరు పిల్లలున్నారని ఆమె చెప్పారు. 2010 లో సుమశ్రీని స్నేహితుడి భార్య అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారని ఆమె చెప్పారు. అప్పటికే ఆమెను వివాహం చేసుకొన్నాడని ఆమె చెప్పారు.

వాళ్ళిద్దరూ కలిసి తనపై దాడి చేసి మా ఫ్లాట్ నుండి బయటకు గెంటేశారని చెప్పారు. ఆ తర్వాత ఫ్లాట్ ను అమ్మెసీ ఆమె కూతురికి కృష్ణకుమార్ వైద్యం చేయించాడని ఆమె ఆరోపించారు. ఏ హోదాతో శివశ్రీకి కృష్ణకుమార్ వైద్యం చేయించాడని ఆమె ప్రశ్నించారు.

కన్నపిల్లలను రోడ్డున వదిలేసి ఎవరికో పుట్టిన బిడ్డకు ఎలా తలకొరివి పెడతారని నీలిమ ప్రశ్నించారు. ఇప్పటికే కృష్ణకుమార్ పై హైద్రాబాద్ నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోందన్నారు నీలిమ. మరో వైపు ఈ కేసుల విషయమై విజయవాడ పోలీసులకు తెలియాలనే ఉద్దేశ్యంతో తాను విజయవాడలో కూడ ఫిర్యాదు చేస్దున్నట్టు చెప్పారామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+