'ఆ ఒక్కడే.. చంద్రబాబు సంగతి తేలుస్తాడు, ఆరోజు కోసమే ఎదురుచూపు'
విజయవాడ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు స్టే తెచ్చుకోవడం పట్ల లక్ష్మీ పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు. చంద్రబాబు సంగతి తేల్చేందుకు 'ఎవడో ఒక్కడు ఖచ్చితంగా వస్తాడని, ఆ ఒక్కడి కోసమే.. ఆరోజు కోసమే తాను నిరీక్షిస్తున్నానని' చెప్పారు.

ప్రపంచం మొత్తంలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఇంకెక్కడా లేడని, ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. వంద శవాలను పీక్కుతిన్న రాబందు సైతం ఒక్క గాలివానకు నేల కూలుతుందని.. అదే తరహాలో చంద్రబాబుకు పాపం పండే రోజు చేరువలోనే ఉందని కామెంట్ చేశారు.
ప్రతీ కేసులోను స్టే తెచ్చుకుని విచారణ నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్న లక్ష్మీ పార్వతి.. చంద్రబాబు అక్రమ ఆస్తులపై తాను కోర్టులో కేసు వేస్తే.. దానిపై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications