లగడపాటి టిడిపి విన్ జోస్యం: బాబుపై లక్ష్మీపార్వతి ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళనా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆదివారం ధ్వజమెత్తారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఎన్నికల్లో జగన్‌ను ఎదుర్కోలేకే చంద్రబాబు, లగడపాటిలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. లగడపాటి ఓ జోకర్ అన్నారు. తండ్రి ఆశయాల కోసం పోరాడుతున్న జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.

గుండెల్లో కాంగ్రెస్: చిరు
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తగ్గలేదని, అందరి గుండెల్లో పదిలంగానే ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు, జగన్ రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారన్నరాు. చంద్రబాబుది ఆఖరి పోరాటమైతే, జగన్‌ది ఆత్మరక్షణ పోరాటమన్నారు.
విజయమ్మపై యనమల ఫైర్
టిడిపి అధికారంలోకి రాగానే జగన్ అక్రమాస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. సీమాంధ్రలో అభివృద్ధికి తొమ్మిది అంశాల పేరుతో జగన్ విడుదల చేసిన బ్లూప్రింట్ ఓ బోగస్ బ్లూప్రింట్ అన్నారు. గతంలో టిడిపి విడుదల చేసిన స్వర్ణాంధ్ర నిర్మాణానికి నవరత్నాలును జగన్ పార్టీ మక్కీకిమక్కి కాపీ కొట్టిందన్నారు. విజయమ్మ గెలిస్తే ఉత్తరాంధ్ర మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాల బారిన పడుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications